![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'.ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -480 లో.. మీరా కడుపులోని బిడ్డకి కారణం ఎవరని ఇంట్లో వాళ్ళంతా నిలదీయగా.. నా బిడ్డకు తండ్రి మురారీనే. వీలైతే మురారీని అడగండి.. అంతవరకు నన్ను మాటలు అనకండి. నేను అబద్ధం చెప్పడం లేదు. నేను అనాథనే కావచ్చు కానీ ఆత్మాభిమానంతో పెరిగినదాన్ని.. నా కడుపులో బిడ్డకు కావాలంటే డీఎన్ఏ చేయించుకోండి.. నేను అబద్దం చెప్పడంలేదంటూ సరోగసి అనే మాట చెప్పకుండా బిడ్డకు తండ్రి మురారి అని చెప్పేసి వెళ్ళిపోతుంది. దాంతో అంత ఆశ్చర్యపోతారు. ఆదర్శ్ మాత్రం నిజమేనని నమ్ముతాడు.
అత్తయ్య తను అబద్దం చెప్తోంది. నమ్మకండి. తను నాకు ఆదర్శ్ బావకు పెళ్లి చేస్తాను అని మా అమ్మకు మాటిచ్చి.. తనే ఆదర్శ్ బావతో పెళ్లికి సిద్ధమైనప్పుడే అర్థమైంది. తనో మాయలాడి అని. తన మన ఇంటి మీద కన్నేసి ఈ ఇంట్లో చేరింది అత్తయ్యా.. మురారీ బావ, ఆదర్శ్ బావ ఇద్దరిలో ఎవరైన ఫర్వాలేదు అనుకుని ఈ ఇంట్లో అడుగుపెట్టింది. ఇప్పుడు కూడా తన కర్మ కాలి ఈ నిజం మనందరికి తెలిసింది కానీ లేదంటే పెళ్లి జరిగిపోయేది కదా అని సంగీత మాట్లాడుతుంది. సంగీత మాటలు అనడం కాదు. ఈ బిడ్డ మురారీ బిడ్డ కాదంటే ఈ ఇంటికే ఉరి తీయ్యండి నన్ను.. నేను ఎక్కడికి పారిపోను.. మురారి వచ్చేదాకా ఆగండి. ఒకవేళ మురారి కూడా నాకేం సంబంధం లేదంటే మాత్రం డీఎస్ఏకి నేను సిద్ధం అంటూ మీరా చెప్పి వెళ్ళిపోతుంది. మురారి గదిలో ఉండు.. ఫోన్ చేస్తే కలవదు. ఇక భవానీ దేవి, రేవతి, మధు, సంగీత అంతా.. మీరా మాటల గురించి మాట్లాడుకుంటుంటే.. నా కొడుకు అలాంటివాడు కాదని రేవతి ఏడుస్తుంది. అప్పటికే రాత్రి అయిపోవడంతో.. ఒకవేళ మురారి కృష్ణ వాళ్ల పుట్టింటికి వెళ్లి ఉంటాడు.. నేను రేపు వెళ్లి తేల్చుకుని వస్తానని భవాని అంటుంది.
మురారికి కృష్ణ ఫోన్ ట్రై చేస్తూనే ఉంటుంది. కానీ ఫోన్ స్విచాఫ్ వస్తుంది. దాంతో కృష్ణ కంగారుపడుతుంది. ఇంతలో ప్రభాకర్ వచ్చి.. పళ్లు అన్నీ తెచ్చి కృష్ణను తినమంటాడు. పుట్టబోయే మనవడిపై ప్రేమ బాగానే ఉందంటూ అప్పుడే భవాని వస్తుంది. ఇద్దరు ఒకరినొకరు పలకరించుకుంటారు.
అవును చెల్లే.. మా అల్లుడిని కూడా తీసుకుని రాపోయావా అని ప్రభాకర్ అంటాడు. అంటే మురారి ఇక్కడికి కూడా రాలేదా? ఈ తింగరికి మురారీ కనిపించడం లేదని తెలిస్తే ప్రమాదమని చెప్పకూడదని భవాని మనసులో అనుకుంటుంది. మురారి చాలా బిజీగా ఉన్నాడని అందుకే రాలేదని భవాని అంటుంది. చెల్లే నువ్వు కరెక్ట్ టైమ్ కి వచ్చావ్. ఇప్పుడే మా ఊరి జాతరలో మా కిట్టయ్యతో ముడుపు కట్టించాలని ఫిక్స్ అయ్యాం. అంతా కలిసి వెళ్దాం చెల్లె అని ప్రభాకర్ అంటాడు. ఇక తరువాయి భాగంలో కృష్ణతో ప్రభాకర్ ముడుపు కట్టిస్తుంటాడు. ఇంతలో భవానికి రేవతి కాల్ చేస్తుంది. అక్కా ఆదర్శ్ ఏం చేశాడో తెలుసా అని అంటుంది. ఏం చేశాడని భవాని అనగానే.. మీరాకు ఆదర్శ్ గన్ గురిపెట్టి ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |